![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో.... జ్యోత్స్నతో పారిజాతం మాట్లాడుతుంది. రాను రాను మీ తాతయ్య దృష్ణిలో నీ మీద ఇంప్రెషన్ పోతుందని పారిజాతం అనగానే.. సత్యరాజ్ రెస్టారెంట్ విషయంలో అంతా ఒకే అయిపోయింది కానీ ఆ దీప వెళ్లి ఏదో మాయ చేసిందని జ్యోత్స్న అంటుంది. అప్పుడే జ్యోత్స్న అంటూ శివన్నారాయణ గట్టిగా పిలుస్తుంటాడు. మళ్ళీ ఏం చేసావే అంటూ పారిజాతం కంగారుపడుతుంది. ఎందుకు ఇలా చేశావ్.. అబద్ధాలతో ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావ్.. అడిట్ లో ఎందుకు తప్పుడు ప్రాఫిట్ చుపించావంటూ శివన్నారాయణ గట్టిగా నిలదీస్తాడు.
దాంతో పారిజాతం జ్యోత్స్న టెన్షన్ పడతారు. నువ్వు ఎంప్లాయిస్ విషయంలో ఫెయిల్ అయ్యావ్. రెస్టారెంట్ కొనడంలో, ప్రాఫిట్ లో ఇలా అబద్ధాలని చెప్పడంలో కూడా ఫెయిల్యూర్ అయ్యావ్.. ఇదంతా ఆ కార్తీక్ వల్లే... కార్తీక్ కార్తీక్ అంటూ వాడి వెంటపడి ఇలా చేస్తున్నావ్.. ఇక నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నీకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నానని శివన్నారాయణ అనగానే.. నో నేను ఒప్పుకోను.. బావనే నా భర్త అంటూ మొండిగా మాట్లాడుతుంది. దాంతో కోపంగా జ్యోత్స్న వెళ్ళిపోతే.. వెళ్లి పెళ్లికి ఒప్పించమని పారిజాతాన్ని శివన్నారాయణ పంపిస్తాడు. అడిట్ విషయంలో ఏం అనకండి.. తప్పు మనది కూడా ఉంది. అది అలా తయారవ్వడానికి కారణం మనమే అని సుమిత్ర, దశరత్ లతో శివన్నారాయణ అంటాడు. మావయ్య జ్యోత్స్నని బాగా అర్థం చేసుకున్నాడు అలాగే అందరిని అర్ధం చేసుకుంటే బాగుండని సుమిత్ర అనుకుటుంది. ఆ తర్వాత కార్తీక్, దీపలు కలిసి సత్యరాజ్ రెస్టారెంట్ ఓపెన్ చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత అక్కడున్న చెఫ్ లతో కార్తీక్ మాట్లాడతాడు.
మళ్ళీ ఏ విధంగా నెంబర్ వన్ కి తీసుకొని రావాలని క్లియర్ గా చెప్తాడు. స్పెషల్ డిష్ గా ఉప్మా బిర్యానీ అంటూ బోర్డు పెడతారు. కస్టమర్ వచ్చి ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత రెస్టారెంట్ కి జ్యోత్స్న వస్తుంది. ఎందుకు వచ్చావని కార్తీక్ అడుగుతాడు. నేను కస్టమర్.. తినడానికి వచ్చానని అంటుంది. ఆ తర్వాత ఉప్మా బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. అది తిన్న జ్యోత్స్న.. బాగుంది అంటుంది కానీ ఏం బాగోలేదంటూ న్యూస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను.. అప్పుడు ఈగలు, దోమలు కొట్టుకుంటూ ఉండాలని అనగానే.. కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |